- 22 కిలోల గంజాయి స్వాధీనం
ఘట్‌కేసర్, వెలుగు: ఒడిశా నుంచి గోవాకు గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరిని ఉప్పల్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్‌చేశారు. పక్కా సమాచారంతో మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యమ్నంపేట పద్మనాభస్వామి ఆలయ ఆర్చ్ సమీపంలో సోమవారం తనిఖీలు చేపట్టారు. ఓ కారును ఆపి, లోపల పరిశీలించగా.. 22 కిలోల గంజాయి లభ్యమైంది.
నిందితులు ఒడిశాకు చెందిన అనిల్‌కుమార్ గౌడ, అవినాష్ శర్మలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయితోపాటు కారు, 2 ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను ఐటీ కారిడార్ పోలీసులకు అప్పగించామని, వారు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
